calender_icon.png 12 February, 2026 | 3:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నటుడు రాజ్‌పాల్‌కు అండ

12-02-2026 01:40:59 AM

  1. మ్యూజిక్ ప్రొడ్యూసర్ రూ.1.11 కోట్ల సాయం
  2. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ వంటి స్టార్ హీరోలు కూడా..

ముంబై, ఫిబ్రవరి 11: చెక్ బౌన్స్ కేసులో చిక్కుకుని తీహార్ జైలులో లొంగిపోయిన ప్రముఖ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు సినీ పరిశ్రమ నుంచి మద్దతు పెరుగుతోంది. మ్యూజిక్ ప్రొడ్యూసర్ రావు ఇందర్జీత్ సింగ్ యాదవ్ ఆయనకు రూ. 1.11 కోట్ల భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. 14వ తేదీ లోపు అవసరమైన మొత్తం సమకూరకపోతే, మిగిలిన మొత్తాన్ని తానే కోర్టులో డిపాజిట్ చేస్తానని భరోసా ఇచ్చారు.

నటుడు సోనూ సూద్ తన తదుపరి సినిమాలో రాజ్‌పాల్ యాదవ్‌కు అవకాశం ఇస్తున్నానని, అందుకు సంబంధించిన అడ్వాన్స్ మొత్తాన్నీ అందిస్తానని హామీ ఇచ్చారు.  సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, వరుణ్ ధావన్ వంటి హీరోలూ రాజ్‌పాల్‌కు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.  దర్శకుడు డేవిడ్ ధావన్ సాయం చేస్తున్నట్లు తెలిసింది.