నూతన ప్రిన్సిపల్ గా డాక్టర్ శ్రీ రంగ ప్రసాద్
10-06-2026 06:37 PM
ముకరంపుర,(విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయంలోని వ్యాపార, వాణిజ్య నిర్వహణ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా డాక్టర్ శ్రీరంగప్రసాద్ ను నియమిస్తూ ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేయగా రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ నియామక పత్రాలు అందజేయగా విసి సమక్షంలో అందుకున్నారు. డాక్టర్ రంగప్రసాద్ ప్రస్తుతము బిజినెస్ మేనేజ్మెంట్ విభాగాధిపతిగా ఐక్యూఏసి డైరెక్టర్గా పనిచేస్తున్నారు.
ఇంతకుముందు ఆయన శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారిగా పనిచేశారు. అనేక కార్యశాల సదస్సులు బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో నిర్వహించి పలు జాతీయ అంతర్జాతీయ సదస్సులలో పత్ర సమర్పణ చేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు విద్యార్థులు ఆయనను కలిసి అభినందనలు తెలియజేశారు.






