జెన్ జెడ్ పాటని రిలీజ్ చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్
ముకరంపుర,(విజయక్రాంతి): భారత ప్రధాని నరేంద్రమోడి నేటితో 12 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్బంగా బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరెడ్ల ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో మోదిపై రూపొందించిన మాస్ జెన్ జెడ్ ర్యాప్ సాంగ్ ని బుధవారం రోజున కరీంనగర్లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ చేతుల మీదుగా పాటను విడుదల చేశారు.
ఈ సందర్బంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ... దేశం కోసం నేటి యువత కోసం నిర్విరామంగా పనిచేస్తున్న ప్రపంచనేత మోదిపై చేసిన పాట బాగుందని కొనియాడారు.మోదీ యువతకోసం ప్రవేశపెట్టిన అనేక పథకాలను బీజేవైఎం ఆధ్వర్యంలో వారికి చేరవేసే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బిజెపి రాష్ట్ర, జిల్లా నేతలు, కార్పోరేటర్లు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.






