ముస్త్యాల మాజీ సర్పంచ్ ఎల్లారెడ్డి మాతృమూర్తి మృతి
10-06-2026 06:39 PM
నివాళులర్పించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
చేర్యాల: చేర్యాల మండలం ముస్త్యాల గ్రామ మాజీ సర్పంచ్ ఏల్లారెడ్డి మాతృ మూర్తి పెడుతల మల్లమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు.విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బుధవారం ముస్త్యాల గ్రామానికి చేరుకుని మల్లమ్మ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాజీ సర్పంచ్ ఎల్లారెడ్డిని,వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి ధైర్యంగా ఉండాలని చెప్పారు. కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.






