25 August, 2026 | 3:31 AM

సూపర్ షీ జోరు!

25-08-2026 12:00 AM

నటి జ్యోతిరాయ్ పూర్వజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సరికొత్త సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కిల్లర్’. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం జ్యోతి పూర్వజ్ ఎంచుకున్న ఒక వినూత్నమైన శైలి ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వివిధ పేపర్ క్లిప్పింగులతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఒక విలక్షణమైన దుస్తులను ధరించి జ్యోతి పూర్వజ్ సరికొత్త ఫోటోషూట్ చేశారు. ‘సూపర్ షీ’ అవతార్‌లో ఉన్న ఈ గ్లామరస్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

సినిమాపై అంచనాలను పెంచేలా ఆమె చేసిన ఈ వినూత్న ప్రచారం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు పూర్వజ్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. జ్యోతి పూర్వజ్, పూర్వజ్, గౌతమ్, వైశాలిరాజ్, పృథ్వీ తివారీ, చంద్రకాంత్ కొల్లు ప్రధాన తారాగణంగా ఉన్నారు. ప్రేమ, పగ, ఏఐ సాంకేతికత, హై-వోల్టేజ్ యాక్షన్ అంశాల కలయికతో ఈ వైవిధ్యమైన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది.