ఇల్లందు సూపర్ లగ్జరీ బస్సు సర్వీసులు వినియోగించాలి
16-03-2026 12:00 AM
ఇల్లందు టౌన్, మార్చి 15 (విజయక్రాంతి): ఇల్లందు నుండి హైదరాబాద్కు, హైదరాబాద్ నుండి ఇల్లందుకు వచ్చే ప్రయాణికులు ఇల్లందు డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణించి ఆదాయం పెరగడానికి సహకరించాలని డిపో మేనేజర్ సునీత ఒక ప్రకటనలో తెలిపారు. ఇల్లందు బస్టాండ్ నుంచి ఉదయం 6:15, 9:30, మధ్యాహ్నం 2:00, 3:00, 4:30, రాత్రి 10:30, 11:30 గంటలకు బస్సులు బయలుదేరుతాయని అదేవిధంగా హైదరాబాద్ నుండి ఉదయం 7:30, 11:00, మధ్యాహ్నం 1:50, 2:45, రాత్రి 10:00, 11:00 గంటలకు ఇల్లందుకు సర్వీసులు నడుస్తాయని తెలిపారు.




