సాయిబాబా ఆలయానికి రిక్షా బహుకరణ
దమ్మపేట, జూన్ 11(విజయ క్రాంతి): మండల పరిధిలోని మందలపల్లి గ్రామంలో గల సాయిబాబా ఆలయానికి మాజీ ఎంపీటీసీ దేవరపల్లి అజయ్ కుమార్ తన సొంత ఖర్చులతో రిక్షాను తయారు చేయించి, అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు చేతుల మీదుగా సాయిబాబా ఆలయ ట్రస్టు సభ్యులకు అందజేశారు. ముందుగా మెచ్చా నాగేశ్వరరావు స్థానిక బి ఆర్ ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మెచ్చా మాట్లాడుతూ సాయిబాబా ఆలయ అవసరాలకు, స్వామివారి నిత్య సేవలకు ఈ రిక్షా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా ముందుకొచ్చి స్వచ్ఛందంగా రిక్షాను బహూకరించిన ఎంపీటీసీ దేవరపల్లి అజయ్ కుమార్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట కాసిని శ్రీను, వెలుగోటి మహేష్, అబ్దుల్ జిన్నా, దండాబత్తుల కాంతారావు, బుద్దుల వెంకన్న, మడిపల్లి పోలరాజు, కొండ్రముచ్చు నాగరాజు, కోళ్ళు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.






