రెండు ముక్కలైన శరీరం!
11-06-2026 03:33 PM
చేగుంట జూన్ 11,విజయక్రాంతి: మాసాయిపేట్ మండల పరిధిలోని స్టేషన్ మాసాయిపేట్, రైల్వే స్టేషన్లో గురువారం తెల్లవారుజామున ఇస్లాంపూర్ గ్రామనికి చెందిన దుందిగొల్ల దాస్( 28) రైలు నుంచి కాలు జారి పడి శరీరం రెండు ముక్కలై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు, ఇతనికి, భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని గ్రామస్తులు తెలిపారు, ఘటనపై స్టేషన్ మాస్టర్,కామారెడ్డి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు కామారెడ్డి రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






