రాయల్ విక్టరీ
సన్‌రైజర్స్ ఔట్
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
ఛేజింగ్‌లో హైదరాబాద్ ఫ్లాప్
టాస్ గెలిచారు.. బ్యాటింగ్ పిచ్‌పై ప్రత్యర్థి అనుకున్న దానికంటే 25 పరుగులు తక్కువకే కట్టడి చేశారు.. భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉండడంతో ఈజీగా ఛేజ్ చేస్తుందని అనుకుంటే బ్యాట్లెత్తేశారు.. ఫలితంగా ఐపీఎల్ 19వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కథ ఎలిమినేటర్‌లో ముగిసింది. ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫైయర్ 2కు దూసుకెళ్లింది.
న్యూ ఛండీఘర్, మే 27: ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్ మరో ఆలోచన లేకుం డా ఫీల్డింగ్ ఎం చుకున్నాడు. అయితే ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ మెరుపు ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా వైభవ్ సన్‌రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కమి న్స్‌తో సహా ప్రతీ బౌలర్‌నూ ఉతికారేశాడు. కొడితే ఫోర్ లేకుంటే సిక్స ర్ అన్న తరహాలో బుడ్డోడి వి ధ్వంసం సాగింది. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూ ర్తి చేసుకున్నాడు. దీనిలో 8 సిక్సర్లు, ఒక ఫోర్ ఉన్నా యి. కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను ఉతికారేశాడు. కమిన్స్ వేసిన రెండో ఓవర్లోనే వరుసగా మూడు సిక్సర్లు బాదేసాడు.
పవర్ ప్లేలో రాజస్థాన్ 80 పరుగులు చేసింది. వైభవ్, జైస్వా ల్ తొలి వికెట్‌కు కేవలం 8 ఓవరల్లోనే 135 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పా రు. వైభవ్ కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేయగా... దీనిలో 12 సిక్సర్లున్నాయి. ఈ సీజన్‌లో ఏకం గా 65 సిక్సర్లు బాదిన వైభవ్ క్రిస్ గేల్ (59) రికార్డును బ్రేక్ చేశాడు. కాసేప టికే జైస్వాల్ (29) ఔటైనా ధృవ్ జురెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రియాన్ పరాగ్ తో కలిసి 55 పరుగులు జోడించాడు.
ఈ క్రమంలో కేవలం 21 బంతుల్లోనే 50 ( 5 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేశాడు. ఇక్కడ నుంచి రాజస్థాన్ వే గంగా వికెట్లు కోల్పోయింది. దీంతో 270 పైగా స్కోరు చేస్తుందనుకున్న రాజస్థాన్ 243 పరుగులకే పరిమితమైంది. బ్యాటింగ్ పిచ్ కావడంతో 244 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఈ స్కోరును ఛేదిస్తుందని అంతా అనుకున్నారు. అయితే తొలి ఓవర్లోనే ఆర్చర్ దెబ్బకొట్టాడు. ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. తర్వాత హెడ్ (17), ఇషాన్ కిషన్ (33) ధాటి గా ఆడి రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించారు.
ఇక్కడ మరోసారి ఆర్చర్ వరు స వికెట్లు తీసాడు. ఫలితంగా పవర్ ప్లేలోనే సన్‌రైజర్స్ 4 కీలక వికెట్లు కోల్పోయింది. స్మరన్ రవిచంద్రన్ ఔటైన కాసేపటికే క్లాసెన్ కూడా వెనుదిరగడంతో హైదరాబాద్ ఓటమి ఖాయమైపోయింది. నితీశ్ రెడ్డి(38), సలీల్ అరోరా(35) 56 పరుగుల భాగస్వా మ్యం నెలకొల్పినా కీలక సమయంలో ఔటయ్యారు. ఇక్కడ నుంచి టెయిలెండర్లు బ్యా టింగ్ కొనసాగించినా పరుగుల అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగారు. ఈ ఓటమితో సన్ రైజర్స్ ఇంటిదారి పడితే రాజస్థాన్ క్వాలిఫైయర్ 2లో గుజరాత్‌తో తలపడనుంది.
స్కోరు బోర్డు
రాజస్థాన్ ఇన్నింగ్స్ : 243/8 ( వైభవ్ సూర్యవంశీ 97, జురెల్ 50, జైస్వాల్ 29 ; ప్రఫుల్ హింగే 3/54, శివాంగ్ కుమార్ 1/19 )
హైదరాబాద్ ఇన్నింగ్స్: (నితీశ్ రెడ్డి 38, అరోరా 35, ఇషాన్ కిషన్ 33 ; ఆర్చర్ 3/58 , జడేజా 2/21, బర్గర్ 2/26)






