10 August, 2026 | 4:23 AM

నగర అభివృద్ధికి నయాపైసా తెచ్చింది లేదు

10-08-2026 12:21 AM

కాంగ్రెస్ నాయకులపై ధ్వజమెత్తిన సునీల్ రావు

ముకరంపుర, ఆగస్టు 9 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ నిధుల వల్లే కరీంనగర్ నగరం అభివృద్ధి చెందుతుందని తెలిసి, తెలియని కొంతమంది నాయకులు గొప్పలు చెప్పుకోవడం హాస్యస్పందంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు.

కరీంనగర్ లో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబం ధించిన మంత్రులు, శాసనసభ్యులు కరీంనగర్ నగర అభివృద్ధికి గానీ జిల్లా అభివృద్ధికి గాని నయాపైసా తెచ్చింది లేదని చెప్పారు. బీజేపీ పాలకవర్గం ఏర్పడితే నిధులు తెస్తామని ప్రజలకు ఇచ్చిన మాట కోసం యు సిఎఫ్ పథకాన్ని తెచ్చినట్లు స్పష్టం చేశారు. ఇందులో 210 కోట్ల రూపాయల నిధులు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇప్పించే బ్యాంకు ఋణమని స్పష్టం చేశారు. 420 కోట్లను హడ్కో ద్వారా కేంద్ర ప్రభుత్వమే ఇప్పించడం జరిగిందని స్పష్టం చేశారు. ఇందులో 25 శాతం వాటా ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వమే గొప్ప అని జబ్బలు చరచుకోవడం విడ్డూరం అన్నారు.

రైల్వే ఓవర్ బ్రిడ్జ్ లో ఇప్పటి వరకు భూసేకరణ పూర్తి చేయ డం చేత కాలేదని ఎద్దేవ చేశారు.హడ్కోకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీతో రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇచ్చే వెసులు బాటు కల్పించిం దని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా కట్టని పరిస్థితిలో 16 వ ఆర్థిక సంఘం నిధు ల నుండి కట్టాల్సి ఉంటుందని 16 వ ఆర్థిక సంఘం నిధులు ఇచ్చేది కూడ కేంద్ర ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. ప్రజలను మభ్య పెట్టి మోసం చేసి రాజకీయ పబ్బం గడుపుకునేల వ్యాఖ్యలు చేయకూడని హెచ్చరించా రు. ఈ విలేకరుల సమావేశంలో కార్పొరేట ర్లు గాజ రమ-శివరాం, బండ రమణారెడ్డి, ఎ న్నం లక్ష్మి-ప్రకాష్, కొంపెల్లి శ్వేత-రామణ్,  తదితరులు పాల్గొన్నారు.