వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ
నస్పూర్,(విజయక్రాంతి): కనీస సామర్ధ్యాలలో వెనకబడిన విద్యార్థుల కోసం వేసవి సెలవుల్లో ఇంటి వద్ద స్వయంగా, సులభంగా అభ్యసించే విధంగా తెలుగు, ఇంగ్లీష్, గణితం విషయాలు క్రోడీకరించి "వేసవి సెలవుల నేస్తం" శీర్షికతో రూపొందించిన పునరభ్యసన పుస్తకం, రీడింగ్ పోస్టర్లను శని వారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓ యాదయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ దండేపల్లి మండలం గుడిరేవు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (MPPS) ఉపాధ్యాయుడు బొలిశెట్టి బుచ్చన్న విద్యార్థులకు సులభతరంగా అర్థమయ్యే రీతిలో తయారు చేసిన పుస్తకం వెనుకబడిన విద్యార్థులకు దోహదపడుతుందని, వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవడానికి ఈ పునరభ్యసన పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వెనుకబడిన విద్యార్థుల కోసం రూపొందించిన ఉపాధ్యాయుడు బుచ్చన్నని ఈ సందర్భంగా అభినందించారు.






