12 May, 2026 | 1:24 AM

చేవెళ్ళ ఆదర్శ పాఠశాలలో సమ్మర్ క్యాంప్

12-05-2026 12:29 AM

ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ దేవర సమతా వెంకట్ రెడ్డి

చేవెళ్ళ మే 11(విజయక్రాంతి): చేవెళ్ళ పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాలలో సోమవారం సమ్మర్ క్యాంప్ ( వేసవి శిక్షణ శిబిరం) స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమతా రెడ్డి కౌన్సిలర్ మద్దెల శ్రీనివాస్ ప్రారంభించారు. ఆనంతరం చైర్ పర్సన్ మాట్లాడుతూ... పిల్లలు మొబైల్స్ కు దూరంగా ఉండాలని సృజనాత్మకతను పెంపొందించుకొని కొత్త నైపుణ్యాలు నేర్చుకోవలని చెప్పారు. చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, యోగా, కరాటే, కంప్యూటర్ శిక్షణ, పర్సనాలిటీ డెవలప్మెంట్, సైన్స్ ప్రయోగాలు, క్విజ్ మొదలైన అంశాలు పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. కౌన్సిలర్ మద్దెల శ్రీను మాట్లాడుతూ... చిన్నతనంలో ఇలాంటి అవకాశాలు తనకు ఉండేవికావని నేటి తరం విద్యార్థులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

పాఠశాలల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మాట ఇచ్చారు. మండల విద్యాధికారి పురందాస్  మాట్లాడుతూ... మొదటి రోజే క్యాంప్ లో దాదాపు 70 మంది విద్యా ర్థులు పాల్గొనడం జరిగిందని వారికి స్నాక్స్ కూడా అందించామని తెలిపారు. మండలంలోని 6 వ తరగతి నుండి 9 వ తరగతి చదివే విద్యార్థులు ఎవరైనా ఇంకా ఈ క్యాంప్ లో ప్రవేశం పొందవచ్చునన్నారు. ప్రవేశం కొరకు విద్యార్థి పాస్ పోర్ట్ సైజు ఫోటోలు తీసుకొని ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఆదర్శ పాఠశాల రావాలని ప్రిన్సిపాల్ చిన్నప రెడ్డి తెలిపారు.