4 March, 2026 | 8:45 AM

సరిపడా చమురు, పెట్రోల్ నిల్వలు

04-03-2026 01:06 AM
  1. ప్రజలు ఆందోళన చెందొద్దు

కేంద్రమంత్రి  జి.కిషన్ రెడ్డి

హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): దేశంలో సరిపడా చమురు, పెట్రోల్  నిల్వలు ఉన్నాయని కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.  పశ్చిమాసియాలో అమెరికా- మధ్య యుద్ధం కారణంగా భారత్ అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.  ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. 

దేశంలో పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్) వంటి పెట్రోలియం ఉత్పత్తులు, క్రూడ్ ఆయిల్ నిల్వలు సరిపడా ఉన్నాయన్నారు.  కొన్నేళ్లుగా దేశంలో ప్రజలకు పెట్రోల్ ఉత్పత్తులు అందుబాటులో ఉంచడంతోపాటుగా అంతర్జాతీయంగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా.. దేశీయంగా ధరలు పెరగకుండా ఉండేలా కేంద్రం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.