28 February, 2026 | 11:38 PM

'స్నాక్స్' లలో నాణ్యత పరిమి(ట్)తం

28-02-2026 09:45 PM

అక్కడ 'కల్లు'షితం 

ప్రాణహాని కలిగి స్తున్న తినుబండారాలు

నమోదవుతున్న ఫుడ్ పాయిజన్ కేసులు

పట్టించుకోని కల్తీ నిరోధక శాఖ అధికారులు

బాన్సువాడ,(విజయక్రాంతి): పట్టణం, పల్లె ప్రాంతాలలో బహిరంగంగా విక్రయిస్తున్న తినుబండారాలు నాణ్యత లోపించి విషపూరితమవుతున్నాయి. నాసిరకం నూనెలు నిత్యవసర సరుకులతో తయారు చేసిన పిండి పదార్థాలు కలిషితంగా మారుతున్నాయి. ధనార్జిని ధ్యేయంగా వ్యాపారులు చేస్తున్న తప్పిదాలకు సామాన్యుల ఆరోగ్యం హరీ అంటుంది. పట్టించుకునే వారు లేక, అధిక లాభాలకు ఆశపడి తినుబండారాల వ్యాపారులు చేస్తున్న ఈ దందాతో ప్రజారోగ్యం పడకెక్కుతుంది. పట్టణంలో నడుస్తున్న  పర్మిట్ రూములు, కళ్ళు పాకలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మిర్చి పకోడీ దుకాణాలు ప్రజారోగ్యాన్ని కాటు వేస్తున్నాయి.

నాణ్యతలేని సరుకులతో నాసిరకం తినుబండారాలు తయారవుతున్నాయి. వాటిని ఆరగించిన వారు ఆస్పత్రుల పాలవుతున్నారు. బాన్సువాడ కామారెడ్డి జిల్లాలో ఏరియా ఆసుపత్రిల్లో గత కొద్ది రోజులుగా ఫుడ్ పాయిజన్ కేసులు అధికంగానే నమోదు అవుతున్నాయి. ప్రధానంగా వైన్ షాపుల పక్కన ఏర్పాటు చేసుకున్న పర్మిట్ రూంలో మందుబాబులకు అందిస్తున్న పిండి పదార్థాలు, పల్లీలు, శనిగలు, బటానీలతోపాటు ప్రై చేసిన చేపలు, చికెన్ పకోడీలు, చికెన్ 65, బోటి కర్రీ, పాయ, లివర్ లాంటి పదార్థాలను తయారు చేయడంలో వాడుతున్న నూనెలతోపాటు అందుకు వినియోగించే మసాలాలు ఇతరత్రా సరుకులు సైతం నాసిరకం ఇవే ఉంటున్నాయి.

కల్లుపాకలలో  అమ్ముడు పోయే  మిర్చి, పకోడీ, ఉడకపెట్టిన గుడాలు ఇతర తినుబండరాలు కూడా పాచిపోయి కలుషితమైన పదార్థాలని అమ్ముతున్నారు. కళ్ళు మత్తులో  వాటిని తింటున్నవారు వాంతులు విరోచనాలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇటు వైన్ షాపులకు అనుసంధానంగా ఉన్న పరిమిట్ రూములు, అటు కల్లుపాకల వ్యాపారులతో కలిసి అమ్ముకుంటున్న తినుబండారాల వ్యాపారులు చేస్తున్న కల్తీ దగాతో ప్రజారోగ్యంపై పూర్తి ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. నాణ్యత మైన నూనెలను వాడకపోవడం, కాలం చెల్లిన మసాలాలను వినియోగించడం, పాచిన వస్తువులనే తిరిగి ఫ్రై చేసి vఇవ్వడం లాంటి చర్యల వల్ల కలుషిత ఆహారం గా మారి ప్రాణహాని జరిగే ప్రమాదం ఉందని కూడా డాక్టర్లు పేర్కొంటున్నారు. 

బార్లు, రెస్టారెంట్లలోనూ అదే పరిస్థితి...

ప్రధాన పట్టణాల్లో కొనసాగుతున్న బార్లు, రెస్టారెంట్లు, పెద్ద పెద్ద హోటల్లలో  అక్కడక్కడ కలిసిత బిర్యానీలు, ఫాస్ట్ ఫుడ్ తినుబండారాలు నాణ్యత లేకుండా నాసిరకంగానే అమ్ముతున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. హోటల్లు, దాబాలు, బార్లు రెస్టారెంట్లలో వారు పాటించాల్సిన నియమాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

ఆహారాన్ని తయారు చేసే కిచెన్ గదిని శుభ్రంగా ఉంచుకొని క్వాలిటీ గా ఉన్న సరుకులని వాడి బిర్యానీలు, ఫ్రై వస్తువులు, మాంసపు కర్రీలు తయారు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ, వారు తీసుకునే జాగ్రత్తలను గాలికి వదిలేసి పైకమే పరమావధిగా భావిస్తున్నారన్న వాదనలు సైతం ఉన్నాయి. పలుచోట్ల బిర్యానీలలో ఈగలు రావు ఈగలు లాంటి క్రిమి కీటకాలు రావడం తో ఘర్షణలు చోటు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి.

కల్తీ నిరోధక శాఖ అడ్రస్ ఎక్కడ...?

మార్కెట్లో అమ్ముడుపోతున్న తినుబండారాల  శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా ఉన్నారు. విధిగా హోటల్లు, రెస్టారెంట్లు, దాబాలు, పర్మిట్ రూములు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లను తనిఖీ చేయాల్సిన తమ ఉద్యోగ బాధ్యతలను విస్మరిస్తున్నారు. ఇటీవల కాలంలో కల్తీ నిరోధక శాఖ అధికారులు ఎక్కడ కూడా తనిఖీ చేసిన సందర్భాలు కనిపించడం లేదు.

ఆహార నాణ్యత ను పరిశీలించి పరిస్థితులు కళ్ళ ముందట ఉన్నప్పటికీ అధికారులు కార్యాలయాలకు పరిమితం అవుతున్నారన్న విమర్శ బహిరంగంగా వినిపిస్తుంది. ఫుడ్ ఇన్స్పెక్టర్ల నిర్లక్ష్యం వల్ల సామాన్య ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కలుషితం ఎక్కడుంది... కల్తీ ఎక్కడ జరుగుతుంది... నాణ్యతలేని తినుబండారాలు ఎక్కడ అమ్ముడుపోతున్నాయి అన్న విషయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తే తప్ప ప్రజారోగ్యాన్ని పరిరక్షించే పరిస్థితి ఉండదు.