4 August, 2026 | 8:27 PM

దమ్మాయిగూడ సమస్యలపై కలెక్టర్‌కు బీజేపీ వినతిపత్రం

03-08-2026 05:59 PM

జవహర్ నగర్,(విజయక్రాంతి): దమ్మాయిగూడ డివిజన్‌లో నెలకొన్న ప్రధాన ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ నాయకులు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దమ్మాయిగూడ–నాగారం ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిన్నందున వెంటనే మరమ్మత్తులు చేపట్టి నూతన రహదారి నిర్మించాలని కోరారు. అలాగే దమ్మాయిగూడలో ప్రభుత్వ స్మశాన వాటిక లేక ప్రజలు అంత్యక్రియల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే తగిన స్థలాన్ని కేటాయించి ప్రభుత్వ స్మశాన వాటికను ఏర్పాటు చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.