రైతులు ఆర్థికంగా ఎదగాలి
20-05-2026 12:00 AM
పీఐసీ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్
కందుకూరు, మే 19(విజయక్రాంతి): వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా కందుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు దీర్ఘకాలిక రుణాలను పంపిణీ చేశారు. మంగళవారం పీఐసీ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్ అర్హులైన రైతులకు, వినియోగదారులకు ఎల్టీ లోన్ చెక్కులను అందజేశారు.
సొసైటీ ద్వారా రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, సకాలంలో రుణాలు అందించి ఆదుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రైతులు ఈ అవకాశాన్ని వాడుకుని ఆర్థికంగా వృద్ధి చెందాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు గోరికెల బీరప్ప, పొట్టి ఆనంద్, చంద్రశేఖర్, సొసైటీ సెక్రటరీలు శంకర్, మహేష్, సిబ్బంది పాల్గొన్నారు.






