4 August, 2026 | 8:26 PM

పివిఎంఎస్ భద్రాద్రి జిల్లా కన్వీనర్‌గా సుగుణారావు

03-08-2026 06:12 PM

కొత్తగూడెం టౌన్,(విజయక్రాంతి): పారంపర్య వైద్య మహాసంగం (పీవీఎంఎస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్ గా, కొత్తగూడానికి చెందిన ప్రముఖ ప్రకృతి వైద్యులు సుగుణారావు ని ఆ సంఘం ఎన్నుకుంది. సోమవారం హైదరాబాద్ కాణాచిగూడ, ఆ సంఘ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిరంతర వైద్య విఙ్ఞాన సదస్సులో భాగంగా జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఎంపిక చేసింది. దీనిలో ఆ సంఘ గౌరవ అధ్యక్షులు సర్జన్ రమేష్, అధ్యక్షులు యాత్రి మహర్షి, ప్రధాన కార్యదర్శి బండి వెంకన్న, ఉపాధ్యక్షులు రామంచి శ్రీనివాస్, భానుప్రసాద్, కోశాధికారి అరుణ, విద్యారాణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కన్వీనర్ సుగుణారావు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే పారంపర అనువంశిక వైద్యులను గుర్తించి వారికి తగిన గుర్తింపు వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. కాగా సుగుణారావును పర్యావరణవేత్త మొక్కల వెంకటయ్య, మన్ కి బాత్ మొక్కల రాజశేఖర్, రామవరం పరిరక్షణ సమితి అధ్యక్షులు మహమ్మద్ ముస్తఫా, ప్రకృతి ఆశ్రమం సభ్యులు దశరథ్ రజ్వా, యల్దండి పూర్ణచందర్ రావు, రావి లక్ష్మీ, శోభారాణి, సాగర్, శంకర్ లు అభినందించారు.