కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను ప్రారంభించిన సునీల్ రావు.
03-08-2026 06:15 PM
ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్‌లోని కాశ్మీర్ గడ్డలో నూతనంగా నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ స్లాబ్ నిర్మాణ పనులను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీల్ రావు మాట్లాడుతూ... ఈ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ లేకపోవడం వల్ల స్థానిక ప్రజలు వివిధ శుభకార్యాలు, కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారని, ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణంతో స్థానికుల ఇబ్బందులు దూరమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఓంప్రకాష్, గట్టుస్వామి, ఖాలీద్, స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.






