27 July, 2026 | 6:31 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

విద్యార్థులు మాస్టర్ మైండ్స్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

03-06-2026 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్ ,జూన్ 2(విజ య క్రాంతి): జిల్లాలో విద్యాశాఖ ఆధ్వర్యం లో గత 4 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మాస్టర్ మైండ్స్ గూగుల్ మీట్ ఆన్లైన్ తరగతులను 10వ తరగతి చదువుతున్న విద్యా ర్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. మంగళవారం స మీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో మాస్టర్ మైండ్స్ ఆన్లైన్ తరగతుల సమన్వయకర్తలు, జిల్లా సై న్స్ అధికారి కటకం మధుకర్, ధర్మపురి వెం కటేశ్వర్లు లతో కలిసి మాస్టర్ మైండ్స్ ప్రచార ప్రతులను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతి రోజు ఉదయం 4.45 గంటల నుండి నిర్వహిస్తున్న ఆన్లైన్ తరగతులు అద్భుత ఫలితా లు సాధిస్తున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.