2 April, 2026 | 4:20 AM

విద్యార్థులు ప్రారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి

02-04-2026 12:38 AM

ఘట్‌కేసర్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): విద్యారులు కేవలం విషయపరిఙ్ఞానం, మార్కుల శాతం, సర్టిఫికెట్ల కోసం మాత్రమే కాకుండా పరిశోధనా దృకృభం, సమాజ, పారిశ్రామిక అవసరాలను గుర్తిస్తూ, నైపుణ్యాలను పెంచుకొని పారిశ్రామికవేత్తలుగా రూపాంతరం చెందాలని పలు పారిశ్రామిక టెక్నాలజీ రంగాలకు చెందిన ప్రముఖులు పిలుపునిచ్చారు.

ఈనెల ఒకటి, రెండు తేదీలు బుధ, గురువారాలలో ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని దివ్యనగర్ లోని నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న ఐ.ఐ.ఆర్.ఏం-26 పారిశ్రామిక విద్యాసంస్థల సంయుక్త పరిశోధన సమావేశంకు ముఖ్య అతిథులుగా ప్రఖ్యాత సంస్థలు, పరిశ్రమలకు చెందిన ప్రముఖులు విచ్చేశారు, బుధవారం నాటి కార్యక్రమంలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ ఎక్స్ పోను సందర్శించారు.

విద్యార్థుల ప్రాజెక్టులను అభినందించారు. విద్యార్థులు తమ భవిష్యత్తును తామే నిర్మించుకోవాలని ఆంగ్ల భాష పరిజ్ఞానం నైపుణ్యం అనర్గళంగా మాట్లాడే శక్తి ఉండాలని వీటితోపాటు సాంకేతిక నైపుణ్యం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పై నైపుణ్యం అత్యంత అవశ్యకమని చెప్పారు. ఉద్యోగ అవకాశాలు నైపుణ్యాలపై ఆధారపడి ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ దివ్య నల్ల, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.ఎన్.వి. రమేష్, హెచ్ ఓ డి లు, అధ్యాపకులు పాల్గొన్నారు.