22 August, 2026 | 9:22 PM

శిశు మందిర్ పాఠశాలలో విద్యార్థుల సైన్స్ ఫెయిర్

22-08-2026 08:06 PM

ముకరంపుర,(విజయక్రాంతి) శ్రీ సరస్వతీ శిశు మందిర్  హైస్కూల్‌లో  సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు తమ సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించే వివిధ శాస్త్రీయ నమూనాలు, ప్రాజెక్టులను ప్రదర్శించారు. విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ, విద్యుత్ ఆదా, పునరుత్పాదక ఇంధన వనరులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలపై రూపొందించిన నమూనాలను ప్రదర్శించారు.

ప్రతి విద్యార్థి తన ప్రాజెక్ట్ యొక్క ఉపయోగం, పనిచేసే విధానం మరియు సమాజానికి కలిగే ప్రయోజనాలను చక్కగా వివరించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానాచార్యులు మోర రణధీర్  విద్యార్థులను అభినందిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథం, సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందిస్తాయని తెలిపారు.అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రాజెక్టులు ఈ నెల 23 మరియు 24 తేదీలలో సిద్దిపేట లో జరిగే విభాగ్ స్థాయి సైన్స్ ఫెయిర్ లో ప్రదర్శిస్తారు. కార్యక్రమంలో ఇంజనీర్ కోల అన్నారెడ్డి విద్యార్థుల ప్రాజెక్టులను సందర్శించి వారి ప్రతిభను ప్రశంసించారు.