22 August, 2026 | 11:09 PM

ఎంపీడీవోకు వార్డు సభ్యుల ఫోరం సన్మానం

22-08-2026 08:08 PM

దోమకొండ,(విజయక్రాంతి): దోమకొండ మండల వార్డు సభ్యుల ఫోరం ఆధ్వర్యంలో మండల ఎంపీడీవోను శనివారం సన్మానించారు. ఈ సందర్భంగా ఫోరం ప్రతినిధులు ఎంపీడీవోకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫోరం మండల అధ్యక్షుడు శివయ్యపల్లి సంతోష్‌కుమార్, ఉపాధ్యక్షుడు కుమ్మరి సేనాపతి, ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, కోశాధికారి నిమ్మ నందు, గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, మహిళా విభాగం అధ్యక్షురాలు తెడ్డుస్వప్న, ఉపాధ్యక్షురాలు ఆశం మౌనిక, ప్రధాన కార్యదర్శి నరసవ్వ, మెట్టు ప్రశాంత్‌గౌడ్, కందుకూరి ప్రభాకర్, సలహాదారులు పడకంటి రవికుమార్, సురభి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.