14 March, 2026 | 2:28 AM

విద్యార్థులు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

14-03-2026 12:00 AM

రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖల మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి

ఘట్‌కేసర్, మార్చి 13 (విజయక్రాంతి): విద్యార్థులు నూతన ఆలోచనలతో ముందుకు వచ్చి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనిరాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖల మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఘట్ కేసర్ సర్కిల్ పరిధి ఘనాపూర్ లోని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో విద్యార్థులలో ఆవిష్కరణ ఆలోచనలను ప్రోత్స హించేందుకు సాప్ ఉన్నతి ఇన్నోవేషన్ మారథాన్ మేరతాన్ 4.0 కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఆధునిక సాంకే తిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, స్టార్టప్ ఆలోచనలను అభివృద్ధి చేసుకునే అవకాశం లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, గనుల మరియు భూగర్భ శాఖల మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ విద్యార్థులు నూతన ఆలోచనలతో ముందుకు వచ్చి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవడం ఎంతో అవసరమని తెలిపారు. ఈకార్యక్రమంలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, వైస్ చైర్మన్  కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, కొమ్మూరి దివ్య డైరెక్టర్ స్ట్రాటజీ, డైరెక్టర్ ప్రొఫెసర్ బి. సుధీర్ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.

అలాగే తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, ఎడునెట్ ఫౌండేషన్ అసోసియేట్ డైరెక్టర్ సందిప్ కౌర్, సాప్ సంస్థకు చెందిన ప్రొడక్ట్ మేనేజర్ ముజాదిద్ సాద్ మహమ్మద్, జేఎన్టీయూ హైదరాబాద్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. వెంకటేశ్వర రావు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. అతిథులు మాట్లాడుతూ, సాప్ కోడ్ ఉన్నతి వంటి కార్యక్రమాలు విద్యార్థులలో ఆవిష్కరణ దృక్పథాన్ని పెంపొందించి, పరిశ్రమల అవసరాలకు తగిన నైపుణ్యాలను అందిస్తాయని అభిప్రాయపడ్డారు. 

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తమ సృజనాత్మక ఆలోచనలను ప్రాజెక్టుల రూపంలో అభివృద్ధి చేసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య, బి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి దేవస్థానం డైరెక్టర్ మెరుగు నరేష్ గౌడ్, కళాశాల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.