విద్యార్థులు ఉన్నత చదువుల కొరకు కష్టపడి చదవాలి
ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి...
బాన్సువాడ, ఆగస్టు 1 (విజయక్రాంతి): విద్యార్థులు తమ జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే కష్టపడి చదవడం ఎంతో అవసరమని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నూతనంగా తరగతి గదుల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలనతో చదివితే మంచి జ్ఞానం సంపాదించడంతో పాటు ఉన్నత విద్యలో రాణించగలరు. ఉన్నత చదువులు మంచి ఉద్యోగ అవకాశాలను కల్పించడమే కాకుండా సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందడానికి కూడా దోహదపడతాయి. అందువల్ల ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని నిర్దేశించుకొని నిరంతరం శ్రమిస్తూ ఉన్నత విద్యను అభ్యసించడానికి కృషి చేయాలి. విద్యార్థులకు అన్ని వసతులు కల్పించామని ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి సలాం సొసైటీ చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి కళాశాల సిడిసి సభ్యులు ఏజాజ్ దాసరి శీను విట్టల్ రెడ్డి కళాశాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు ఉన్నారు.






