నూతన ట్రాక్టర్‌కు శ్రీకారం చుట్టిన దుద్దిళ్ల శ్రీను బాబు
కార్యకర్తలతో కలిసి ట్రాక్టర్ నడుపుతూ కాసేపు సందడి
మంథని,(విజయక్రాంతి): టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు శనివారం నూతన ట్రాక్టర్ వాహనాన్ని ప్రారంభించారు. యజమానులకు శుభాకాంక్షలు తెలియజేసి, వాహనం సురక్షితంగా నడుపుతూ అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కార్యకర్తల ఆహ్వానం మేరకు శ్రీను బాబు స్వయంగా ట్రాక్టర్ స్టీరింగ్ చేపట్టి కొద్దిసేపు నడిపారు. ఆయనతో పాటు కార్యకర్తలు కూడా ట్రాక్టర్‌పై ప్రయాణిస్తూ సందడి చేశారు. ఈ దృశ్యాలు అక్కడున్న వారిని ఆకట్టుకున్నాయి.
అనంతరం శ్రీను బాబు మాట్లాడుతూ... రైతు కుటుంబాలకు వ్యవసాయ యంత్రాలు ఎంతో ఉపయోగపడతాయని, ఆధునిక వ్యవసాయ పరికరాల వినియోగంతో వ్యవసాయ వ్యయం తగ్గి దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రైతులు సాంకేతికతను వినియోగించుకుంటూ వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజుతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు, రైతులు, ట్రాక్టర్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.






