11 April, 2026 | 8:58 PM

విద్యార్థులు కష్టంతో కాక ఇష్టంతో చదవాలి

11-04-2026 07:03 PM

వాగ్దేవి కరస్పాండెంట్ ఏనుగు మైపాల్ రెడ్డి

హుజురాబాద్,విజయక్రాంతి): విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని వాగ్దేవి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ ఏనుగు మైపాల్ రెడ్డి అన్నారు. విద్యార్థుల వీడ్కోలు సమావేశం శనివారం కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని సాయి రూప గార్డెన్స్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని విద్యార్థులు వారి కమ్యూనికేషన్,స్కిల్స్ ని పెంపొందించుకొని ఉద్యోగాలు సాధించాలని విద్యార్థులను కోరారు. విద్యార్థి దశ నుండే ఒక ఒక ఏం ఎంచుకొని ఉద్యోగం సాధించి తల్లిదండ్రులకు,కలశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు.

 ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకున్నా విద్యార్థుల నుండి  ఫీజు వసూలు చేయకుండా నాణ్యమైన విద్యానందిస్తున్న  ఏకైక కళాశాల వాగ్దేవి డిగ్రీ కళాశాల అన్నారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు, సంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బొక్కల ప్రవీణ్ రెడ్డి, అధ్యాపకులు కొలిపక రమేష్, రామారాపు భద్రయ్య వేముల శ్రీనివాస్,చందా వెంకటేష్, సురేష్,మేకల నవీన్, స్వప్న, ప్రియాంక, విద్యార్థిని, విద్యార్థుల తో పాటు  తదితరులు పాల్గొన్నారు.