కంటోన్మెంట్ బోర్డు జనరల్ బాడీ సమావేశం
- పలు అంశాలపై తీర్మానం
- బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ రాజీవ్,
- కంటోన్మెంట్ బోర్డు సీఈవో అరవింద్ కుమార్ ద్వివేది
సికింద్రాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి సమావేశంలో ఏజెండా లోని పలు అంశాలపై అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుని అసమైన మేరకు కొన్ని అంశాలకు ఆమోదం తెలిపారు. బ్రిగేడియర్ ఎస్.రాజీవ్ అధ్యక్షతన శనివారం జరిగిన కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి సమావేశంలో బోర్డు సీఐఓఆర్వింద్ కుమార్ ద్వివేది, స్థానిక ఎమ్మెల్యే,నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లిఖార్జున్ పాల్గొని కంటోన్మెంట్ అభివృద్ధికి దోహదపడే, ప్రజలకు ప్రయోజనం కలిగించే పలు అంశాలు కూలంకషంగా చర్చించారు.
ఏజెండాలో పొందుపర్చిన ప్రతిపాదనలను ఆమోదం తెలిపారు.ఈ సందర్బంగా బోర్డు పరిధిలోని నూతన భవన నిర్మాణ నిబంధనలపై విస్తృతంగా చర్చిస్తున్నారు. కంటోన్మెంట్ ను ఆనుకుని ఉన్న జీహెచ్‌ఎంసీలో బహుళ అంతస్తుల నిర్మాణాలకు సులువుగా అనుమతి లభిస్తుండగా కంటోన్మెంట్లో కఠినతర మైన నిబంధనలు కొనసాగుతున్నాయి. రక్షణ శాఖ సంస్థలు, బేగంపేట విమానాశ్రయం ఉన్నందున భద్రతా చర్యల దృష్ట్యా నూతనభవనాలు, ముఖ్యంగా బహుళ అం తస్తుల భవనాల నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం లేదు.
గ్రౌండ్ ప్లస్ 2 అంతస్తులకు మించి నిర్మాణాలు చేసే పరిస్థితులో కంటోన్మెంట్ పరిధిలో లేవు. దానితో చాలా మంది ప్రజ లు నిబంధనలను ఉల్లంఘిస్తూ అదనపు అంతస్తులు కట్టారు. వీటికి చెక్ పెట్టడంతో పాటు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భవన నిర్మాణ నిబంధనలకు మార్పులు తీసుకురావాలని రెండు దశాబ్దాలపై స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు మొర పెట్టుకుంటున్నారు. దానితో కేంద్ర రక్షణ శాఖ స్పందించి, నూతన భవన నిర్మాణాల ముసాయిదాను తయారు చేసి పంపాలని చాలా కాలం నుంచి రక్షణ శాఖ కోరుతోంది.
దీంతో కంటోన్మెంట్ బోర్డు అధికారయంత్రాంగం కొత్త నిబంధనలు రూ పొందించారు. దీనికి రక్షణ శాఖ అధికారులు అంగీ కరించిన గ్రౌండ్ ప్లస్3 అంత స్తుల వరకు అనుమతించేలా తాజా నిబంధనలు రూ పొందించారు. చదరపు మీటర్ల స్థాయి బట్టి అంతస్తులకు అనుమతించాలని, సెట్ బ్యాక్ నిర్మా ణదారులకే కొంత వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్‌ఎస్‌ఐ) శాతాన్ని 1.8 శాతం నుంచి 22కు పెంచాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఈ ప్రతిపాదనలను రక్షణ శాఖకు పంపి, వారు ఆమోదిస్తే అమలులోకి వస్తుందని, సికింద్రాబాద్ కంటో న్మెంట్తో పాటు దేశ వ్యాప్తంగా అన్ని కంటోన్మెంట్‌లలో కూడా భవన నిర్మాణ నిబంధనలను మార్చడంపై రక్షణ శాఖ దృష్టి సారించినట్లు కంటోన్మెంట్ సీఈఓ అర్వించ్కుమార్ ద్వివేది తెలిపారు. ఇదే క్రమంలో కంటోన్మెంట్ పరిధి లో ఉన్న అక్రమ హోర్డింగులను తొలగించాలని నిర్ణయించామని, దీనితో పాటు ఆయా ప్రాంతాలకు అనుమతివ్వడం ద్వారా రాబడి పెంచుకోనున్నట్టు అధికారులు వెల్లడించారు.




