29 March, 2026 | 2:24 AM

ఎల్పీజీ కొరతతో ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు

29-03-2026 12:33 AM

ముషీరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): హైదరాబాద్ వంటి నగరాల్లో ఆటో ఎల్పిజి కొరత డ్రైవర్లకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని, ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద పొడవైన క్యూల కారణంగా వారి పని గంటలు, ఆదాయం తగ్గిపోతున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఆటో ఎల్పిజి కొరత తీర్చాలని ఏఐటీయూసీ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. వెంకటేశం డిమాండ్ చేసారు.

హైదరాబాద్ హిమాయత్ నగర్ వై జంక్షన్ వద్ద శనివారం ఆటో ఎల్పిజి కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ ప్రదర్శన నిర్వహించి ఆటో ఎల్పిజి కొరతను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేసారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సీనియర్ నాయకులు విఎస్. బోస్, యూనియన్ నేతలు సిహెచ్. జంగయ్య ఎస్. అశోక్, శ్రీనివాస్, మురళి, మల్లేష్ గౌడ్, లతీఫ్, ఏం. నర్సింహ ఎండీ. జాకీర్ మల్లికార్జున్ ఎం. కృష్ణ ప్రభు తదితరులు పాల్గొన్నారు.