22 August, 2026 | 4:21 AM

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలి

22-08-2026 12:47 AM

జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ 

మహబూబాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు ను పెంచాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకునే విధంగా ఉపాధ్యాయులు, విద్యాధికారులు కృషి చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ విద్యాశాఖ పై సమీక్షా సమావేశం నిర్వహించారు.

కేజీవీబీలు, మోడల్ స్కూల్స్, జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలలో పిల్లల అడ్మిషన్లను పెంచి వారికి నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. ఆంగ్ల భాషాభివృద్ధి కోసం రూపొందించినఎల్ ఈ ఏ పీ  పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి  సత్యనారాయణ మూర్తి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నితీష్ , విద్యాశాఖలోని వివిధ శాఖల అధికారులు రాములు, అప్పారావు, కోఆర్డినేటర్లు పూర్ణచందర్, సురేష్,  వెంకటేశ్వర్లు,  గాయత్రి, సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.