calender_icon.png 18 February, 2026 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లారీ కింద పడి విద్యార్థి మృతి

18-02-2026 12:00:00 AM

మీర్‌పేట్ పరిధిలో విషాదం

బడంగ్‌పేట్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి) : హైదరాబాద్ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసు కుంది. నాదర్‌గుల్‌లో కృష్ణ సాయి కాలనీకి చెందిన గొర్రె పోతుల వర్ధన్ (19) బాలాపూర్ చౌరస్తాలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఐటిఐ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రోజు వారి లాగా తన బైక్ (AP35 AD8497)పై నాదర్గుల్ నుంచి కాలేజీకి బయలుదేరాడు.

నాదర్గుల్ నుంచి బడంగ్పేట్ వైపు వెళ్తున్న టిప్పర్ లారీ (AP04 TT4717)ని దాటేందుకు వర్ధన్ ప్రయత్నించగా అదే సమయంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటో ఒక్కసారిగా రోడ్డు మీదకు రావడంతో వర్ధన్ బైక్ ఆటోను తాకి అదుపు తప్పింది. ఈ క్రమంలో వర్ధన్ లారీ ముం దు చక్రాల కింద పడిపోగా, లారీ సుమారు 50 మీటర్ల మేర అతడిని ఈడ్చుకుంటూ వెళ్లింది. ఘటన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ప్రమాద స్థలానికి చేరుకున్న మీర్పేట్ పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.