విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
బాసర త్రిబుల్ ఐటీలో ఘటన
నిర్మల్, జూన్ 17 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసర త్రిబుల్ ఐటీలో ఓ విద్యార్థిని బుధవారం ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. బీటెక్ చదువుతున్న విద్యార్థిని భవనంపై నుంచి దూకడంతో తీవ్ర గాయాలు కాగా ఆమెను హుటాహుటిన నిజాంబాద్ ఆసుపత్రికి తరలించినట్టు చెప్తున్నారు. మొదట గదిలో ఆత్మహత్యయత్నం చేసినట్టు ప్రచారం జరుగుతుంది.
ఆ తర్వాత గది బయటకు వచ్చిన ఆ విద్యార్థి నాలుగవ అంతస్తు భవనం నుంచి కిందికి దూకడంతో తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో ఉండగా తోటి విద్యార్థులు గుర్తించి బాసర త్రిబుల్ ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ ఘటన మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో జరిగినప్పటికీ సాయంత్రం వరకు బయటకు రాకుండా అంతా గోప్యంగా ఉంచటంపై అనుమా నాలు తలెత్తుతున్నాయి. ఆత్మ హత్యయత్నానికి కారణాలు తెలియ రాలేదు.






