19 April, 2026 | 1:51 AM

సీఎం సభకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

19-04-2026 12:00 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లాలో ఈ నెల 20న నిర్వహించనున్న సీఎం రేవంత్‌రెడ్డి సభ ఏర్పాట్లను శనివారం కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్ కలిసి పరిశీలించారు. సభ ప్రాంగణం, బారికేడ్లు, స్టేజ్ స్థితిగతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పార్కింగ్ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్, అవసరమైతే అదనపు స్థలాన్ని చదును చేసి వాహనాల నిలుపుదల సౌకర్యాన్ని విస్తరించాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్‌బీ ఈఈ రమేష్, డీఎస్పీ సూర్యనారాయణ, సీఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.