6 July, 2026 | 4:06 PM

Breaking News

8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత   •   శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •  

శిశు విక్రయాలు విక్రయిస్తే కఠిన చర్యలు

30-10-2025 07:02 PM

ఐసిడిఎస్ సిడిపివో ఆస్త్ర అంజుమ్..

నకిరేకల్ (విజయక్రాంతి): శిశువిక్రయాలు చట్ట విరుద్ధమని దత్తత పేరుతో ఎవరైనా శిశువిక్రయాలు జరిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఐసిడిఎస్ సిడిపిఓ అస్రా అంజుం పేర్కొన్నారు. గురువారం మండలంలోని నకిరేకల్, నోముల, మండలాపురం గ్రామాలలో వివిధ ఇండ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎవరికైనా దత్తత కావాలంటే కారా వెబ్సైట్ నుండి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అనంతరం ఇద్దరు ఆడపిల్లల తల్లి, బాలింత గృహ సందర్శనకు వెళ్లి శిశువిక్రయాలు, అక్రమ రవాణా, బాల్య వివాహాల గురించి అవగాహన కల్పించారు. ఆమె వెంట ఐసిడిఎస్ సూపర్వైజర్లు సునీత, భవాని, అంగన్వాడి టీచర్లు పి. నాగమణి, కవిత పాల్గొన్నారు.