అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు
08-05-2026 12:00 AM
తాండూరు, మే 7, (విజయక్రాంతి): సరైన ధ్రువపత్రాలు ఏవి లేకుండా ఆవులను గేదెలను తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భారీగా జరిమానాలు విధిస్తామని వికారాబాద్ జిల్లా పెద్దెముల్ తహసిల్దార్ వెంకటేష్ ప్రసాద్ అన్నారు. గురువారం గోవులను తరలిస్తున్న ఓ కేసులో మొయినుద్దీన్ , తర్బాస్, మహమ్మద్ వాజిద్ ,ఆంజనేయులు లను పోలీసులు తాసిల్దార్ ముందు బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ గోవులను అక్రమంగా తరలిస్తే ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు.






