ఈనెల 26న ఖమ్మంలో సీల్సీ జిల్లా మహాసభ జయప్రదం చేయండి
సీల్సీ జిల్లా అధ్యక్షులు సింగ్ ఉపేందర్ రావు
చుంచుపల్లి,(విజయక్రాంతి): ఈనెల 26న ఖమ్మం జిల్లా కేంద్రంలో పౌర హక్కుల సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా 18వ మహాసభ జరగనున్నదనీ, న్యాయవాదులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు హాజరుకావాలని కోరారుఅనంతరం కొత్తగూడెం జిల్లా కోర్టు సమీపంలో మహాసభల గోడ పత్రికలను న్యాయవాదులతో కలసి ఆయన ఆవిష్కరించారు. సభలకు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, నారాయణ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మూడు వందమంది ప్రతినిధులు ఈ సభకు హాజరవుతున్న ట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీల్సీ జిల్లా అధ్యక్షులు ఎస్ ఉపేందర్ రావు, న్యాయవాదులు వీరమల్ల సురేష్ కుమార్, రమేష్, మెండు రాజామల్లు, మురరళీకృష్ణ, నాగేష్ సిహెచ్ .వి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.






