21 August, 2026 | 1:25 AM

ట్రైనీ డీఎస్పీల మానవతా సేవ

21-08-2026 12:10 AM

కస్తూర్భా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్‌ను సందర్శించిన డీఎస్పీలు

రాజేంద్రనగర్, ఆగస్టు 20 (విజయ క్రాంతి): ఆర్బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 112 మంది  ప్రొబేషనరీ డీఎస్పీలు గురువారం కస్తూరిబా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ను సందర్శించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలోని వృద్ధాశ్రమం, ప్రజ్వల రెస్క్యూ హోమ్, ప్రత్యేక సంరక్షణ కేంద్రాలు, మహిళల శిక్షణ కేంద్రాలను పరిశీలించి, వృద్ధులు, మహిళలతో ఆత్మీయంగా మాట్లాడారు. మహిళలు తయారు చేసిన జ్యూట్ బ్యాగులను కొనుగోలు చేసి ప్రోత్సహించారు.

అనంతరం సామాజిక బాధ్యతగా రూ.56 వేల విరాళం అందజేశారు. ట్రస్ట్ ఇన్చార్జీలు మూర్తి, శ్రీనివాస్ సేవా కార్యక్రమాలను వివరించారు. సామాజిక బాధ్యతను పెంపొందించే ఫీల్ విజిట్స్కు అవకాశం కల్పించిన అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ కు ట్రైనీ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. డీఎస్పీ ఆదూరి శ్రీనివాసరావు లైజన్ ఆఫీసర్గా వ్యవహరించారు.