8 August, 2026 | 3:48 AM

నిషేధిత గడ్డిమందు విక్రయిస్తే కఠిన చర్యలు

08-08-2026 12:01 AM

మహబూబాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): ప్రభుత్వం నిషేధించిన పారాక్వాట్ గడ్డి మందు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని తొర్రూరు ఎస్‌ఐ ఉపేందర్, ఏవో రామ నరసయ్య హెచ్చరించారు. తొర్రూరు పట్టణంలోని క్రిమిసంహారక మందులు, ఎరువుల విక్రయ దుకాణాల్లో శుక్రవారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాల్లో లైసెన్సులు, స్టాక్ రిజిస్టర్లు, మందుల నిల్వలను పరిశీలించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, రైతులకు నాణ్యమైన, అనుమతించబడిన వ్యవసాయ ఉత్పత్తులనే విక్రయించాలని సూచించారు.