1 July, 2026 | 1:34 AM

రోడ్డు, ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే కఠిన చర్యలు

01-07-2026 12:34 AM

తిరుమలగిరి ట్రాఫిక్ ఏసీపీ జి.శంకర్ రాజు

పాల్గొన్న డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్, టౌన్ ప్లానింగ్ అధికారి 

కె. శ్రీనివాస్ రెడ్డి, ఆల్వాల్ ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ హరిలాల్

సికింద్రాబాద్, జూన్ 30 (విజయ క్రాంతి): మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, పాదచారుల భద్రత కోసం ఆక్రమణల తొలగింపు డైరీ ఫార్మ్ రోడ్ లో నిర్వహించారు. మల్కాజ్గిరి కమిషనర్  బి. సుమతి ఆదేశాలు, డీసీపీ ట్రాఫిక్-1  రాహుల్ రెడ్డి సూచనల మేరకు మంగళవారం కనాజిగూడ, డైరీ ఫార్మ్ రోడ్ లో రోప్ ఆపరేషన్ నిర్వహించారు.

తిరుమలగిరి ట్రాఫిక్ ఏసీపీ జి.శంకర్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ ఆల్వాల్ సర్కిల్-2 డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్, టౌన్ ప్లానింగ్ అధికారి కె. శ్రీనివాస్ రెడ్డి, ఆల్వాల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ హరిలాల్,రిజర్వ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్తో పాటు జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్, పోలీసు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఏసిపి జ.శంకర్ రాజు మాట్లాడుతూ.రహదారులు, ఫుట్పాత్లపై చాలా కాలంగా ఉన్న అక్రమ ఆక్రమణలను తొలగించారు.

వాహనాల రాకపోకలు అంతరాయం లేకుండా సాగేందుకు, పాదచారులు సురక్షితంగా నడిచేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగిస్తున్న అనధికార నిర్మాణాలు, రహదారులు, ఫుట్పాత్లను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.ఈసందర్భంగా అధికారులుదుకాణదారులకు, వీధి వ్యాపారులు, స్థానిక ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.