27 July, 2026 | 2:03 AM

కళ్యాణకట్టల్లో నగదు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు

27-07-2026 12:00 AM

ఈవో రమాదేవి

వేములవాడ, జూలై 26, (విజయ క్రాంతి): వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వా మి దేవస్థాన కళ్యాణకట్టల్లో భక్తుల నుంచి నగదు వసూళ్లకు సంబంధించిన వీడియో లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంపై దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి స్పం దించారు. భక్తుల నుంచి నగదు డిమాండ్ చేయడం దేవస్థానం ప్రతిష్ఠకు భంగం కలిగిస్తుందని పేర్కొన్నారు.కళ్యాణకట్టల్లో విధులు నిర్వహిస్తున్న నాయి బ్రాహ్మణులను పిలిపించి భక్తులతో మర్యాదగా వ్యవహరిం చా లని, ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు అడగరాదని స్పష్టం చేశారు. ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతమైతే బాధ్యులపై చ ట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

భక్తులకు ఏవైనా ఇబ్బందులు ఎ దురైతే సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయకుండా నేరుగా దేవస్థానం కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయా లని సూచించారు. ఫిర్యాదులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ ఈవోలు జయకుమారి, శ్రీ నాగుల మహేష్, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, రాజేందర్, ఆలయ ఉద్యోగులు, నాయి బ్రాహ్మణులు పాల్గొన్నారు.