విద్యుత్ వృధా అధికారుల నిర్లక్ష్యం....?
పగలు వీధి స్తంభాలకు వెలుతురు, కొన్నిచోట్ల రాత్రి వేళల్లో అంధకారం
మసక వెలుతురు కు పరిష్కారం ఎప్పుడో....?
జిన్నారం/అమీన్ పూర్: జిన్నారం, గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని మాదారం విద్యుత్ అధికారుల నిర్వహణ లోపం, రాత్రి వేళల్లో వెలుగాల్సిన వీధి దీపాలు పగటిపూట వెలుగుతూ, కొన్ని స్తంభాలకు లైట్లు ఫెయిల్ అయి రాత్రిళ్లు అంధకారంలో ఉంటున్నాయి. నెలలు గడుస్తున్న మున్సిపల్ అధికారులు బల్బులు మార్చడం లేదు, దీని వల్ల దొంగతనాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు. పగలు వీది దీపాలు విద్యుత్ వృధా కు ఇబ్బందులకు దారితీస్తోంది. ఇది ఇలా ఉంటే వార్డులలో ఉదయం, సాయంత్రం మసక వెలుతురులో ఇంట్లోని టీవీలు, మిక్సీలు, రైస్ కుక్కర్లు , ఫ్రిజ్లు, ముఖ్య గా ఇండ్లలోని బోర్లు కూడా కారబోతున్నాయని ఎన్నిసార్లు ఏఈ, డిఈ లకు దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా ఏఈ, డిఈ లు స్పందించి మసక వెలుతురు సమస్య, వీధి దీపాలను రాత్రి సమయంలో మాత్రమే వెలిగెలా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.




