5 March, 2026 | 1:23 PM

మొక్క జొన్న రైతుల బకాయిలు వెంటనే చెల్లించాలి

05-03-2026 11:57 AM

రైతు భరోసా డబ్బులు వెంటనే బ్యాంకు ఖాతాలో జమ చేయాలి

రైతు సంఘం జిల్లా కార్యదర్శి దశరథం డిమాండ్

సదాశివనగర్,(విజయక్రాంతి): మొక్కజొన్న రైతుల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి(District Secretary of Farmers' Association) దశరథం డిమాండ్ చేశారు. గురువారం కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం వజ్జపల్లి గ్రామంలో రైతులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ ధర్నాలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి పబ్బ దశరథం, వజపల్లి గ్రామ సర్పంచ్ రాధాబాయి శ్యామరావు గారు, ఎర్రం స్వామి, నాగేష్, గజే చిన్నన్న శివ, సాయిలు, లింగాల సాయిలు,  జగ్గా రాములు, సాకలి మైపాల్ తదితరులు పాల్గొన్నారు మార్చు 15 లోపల బకాయిలు చెల్లించకుంటే హైవే రోడ్డుపైన ధర్నాకు దిగుతామని  అన్నారు.  రైతు భరోసా ఇవ్వాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే ధర్నా ఉధృతం చేస్తామని రైతు సంఘం తరఫున రైతుల తరఫున రైతు సంఘం జిల్లా కార్యదర్శి దశరథం తెలిపారు.