calender_icon.png 24 February, 2026 | 8:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ జిల్లాలో గాలివాన బీభత్సం

24-02-2026 01:06:29 AM

నిర్మల్, ఫిబ్రవరి ౨౩ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం రాత్రి వడగళ్ల వాళ్లతో కురిసిన గాలివాన బీభత్సం రైతులను ప్రజలను ఇబ్బంది పెట్టింది. రాత్రి 7 గంటల సమయంలో ఒక్కసారిగా ఆకాశం కారు మబ్బులు కొమ్ముకుని ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన రాళ్లతో కూడిన వర్షం కురిసినట్లు రైతులు పేర్కొంటున్నారు.

నిర్మల్ జిల్లాలోని కుబీర్ తానూర్ లోకేశ్వరం బైసా కుంటాల సోన్ నర్సాపూర్ నిర్మల్ రూలర్ మండలాల్లో భారీ వర్షంతో పాటు రాళ్ల వర్షం కురిసింది. దీంతో గాలివాన ప్రభావం కారణంగా ఫోన్ మండలంలోని వెలు పల గ్రామంలో విరిగిపోయాయి. ఆయా గ్రామాల్లో భారీ వర్షం కారణంగా పంటచేల్లో నిర్వహించిన మిర్చి పసుపు తడిసి ముద్ద కాగా మొక్కజొన్న జొన్న ఇతర పంటలు నేలకొరిగినట్టు రైతులు తెలిపారు.

రాత్రి సమయం కావడంతో పంట పొలంలోకి వెళ్లి పంటలు కాపాడుకునే అవకాశాలు లేకుండా పోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఇదే తరహాలో గాలివాన రాళ్ల వర్షం రైతులను నష్టపస్తుండగా ఈ సంవత్సర కూడా అలాగే ప్రకృతి రైతుపై కన్న చేసింది. మామిడి తోటలో ఉన్న భూతా ఖాతా కూడా రాలిపోయినట్టు మామిడి రైతులు తెలిపారు. అరగంటసేపు కురిసిన గాలివాన దినోత్సవంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు