calender_icon.png 24 February, 2026 | 9:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీల కల సహకారం చేసింది కేసీఆరే

24-02-2026 01:07:43 AM

ఎమ్మెల్యే అనిల్ జాదవ్

నేరడిగొండ, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి):  మండలంలోని రోల్ మామడ మాజీ సర్పంచ్ హర్క యాదవ రావ్ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో తన అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. సోమవారం వీరితో పాటు హర్క రాందాస్, మాడావి బాపురావ్, సుదర్శన్, హేమంత్ రావ్, రాములు, మెస్రం జంగు, జుగదిరావ్, దొందేరావ్, మాడావి మంతు, గెడం జైతూ, మానిక్రావ్, కోస్రావ్, శంబు తదితరులు మాజీ సర్పంచ్ యాదవ రావ్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

ఆదివాసుల కల ను సాకారం చేసిన బీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్ తోనే ఉంటామని అన్నారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... గ్రామ అభివృద్ధికి అందరూ కలసికట్టుగా ఉండాలని, ఆదివాసుల ఎన్నో ఏండ్ల ‘మావ నాటే మావ రాజ్‘ కల ను సాకారం చేసింది మాజీ సీఎం కేసీఆర్ ని అన్నారు. ఆదివాసుల ఆరాధ్యదైవం కొమురం భీమ్ మ్యూజియం ఏర్పాటు చేసి గౌరవించింది కేసీఆర్ ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మాజీ జడ్పీటీసీ జహీర్, పండరీ, శ్రీధర్ రెడ్డి తదితరులు ఉన్నారు.