కళ్యాణ లక్ష్మిని ఆపేస్తే ఆడబిడ్డలను అవమానించినట్టే..
జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య..
జవహర్ నగర్, ఆగస్టు 17 (విజయక్రాంతి): కల్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేయాలని చూడడం దారుణమని యావత్ తెలంగాణ ఆడబిడ్డలను అవమానించినట్టేనని జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య మండిపడ్డారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆటంకాలు కలిగించడానికి నిరసిస్తూ ఉమ్మడి జవహర్ నగర్ లోని మాజీ మేయర్ మేకల కావ్య ఆధ్వర్యంలో సోమవారం ప్రజా పరిపాలన కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా మేకల కావ్య మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి పథకంలో ప్రతి ఇంట్లో కేసీఆర్ పెద్దన్నలా మేనమామలా నిలిచారని దేశ చరిత్రలోనే ఈ పథకాలు ఆదర్శంగా నిలిచాయన్నారు. హైకోర్టును సాకుగా చూపుతూ లక్షలాది కుటుంబాలకు భరోసా కల్పించకుండా పథకాలను ఉద్దేశపూర్వకంగా ఎత్తివేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిట్టా శ్రీనివాసరెడ్డి సుధాకర్ చారి, ప్రసాద్, పంతంగి సిద్ధులు యాదవ్, వెంకటేష్, అహ్మద్ పాషా, లక్ష్మణ్, ఎల్ల స్వామి, నరసింహ, మహేష్ యాదవ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.






