సహజత్వానికి దగ్గరగా నాన్న కుట్టి
తండ్రీకూతురు సెంటిమెంట్ కథతో విజయ్ ఆం టోనీ హీరోగా ముమారన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నాన్న కుట్టి’. మీరా విజయ్ ఆంటోని నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. కథానాయకుడు విజయ్ ఆంటోనీ ఈ సినిమాకు సంగీతం అందించడంతోపా టు ఎడిటర్‌గానూ వ్యవహరించారు. తా జాగా విజయ్ ఆంటోని బర్త్‌డే సందర్భం గా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.
సహజత్వానికి దగ్గరగా ఉండే కథగా ఈ సినిమా రూపొందుతోందని ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలో ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, అరువి మధన్, చిత్ర లక్ష్మణన్, శ్రీజ రవి, వెట్టై ముత్తుకుమార్, జెన్సన్ దివాకర్, మురుగానందం, ము న్నార్ రమేశ్, లిస్సీ ఆంటోని, కుమార్ నటరాజన్, విజయన్, ప్రవీణ, హరిత, హరిప్రియ ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ చిత్రానికి డీవోపీ: రాజీవ్ రాజేంద్రన్; ప్రొడక్షన్ డిజైన్: ఏ రాజా.






