25 August, 2026 | 1:38 AM

కొండా సురేఖ చేరికపై పార్టీ నిర్ణయం

25-08-2026 12:32 AM
  1. కాంగ్రెస్‌కు ఆగస్టు సంక్షోభం
  2. బీజేపీ ఎంపీ డీకే అరుణ

హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతుందని, ఆమెను పార్టీలోకి తీసుకోవాలా, వద్దా? అని పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. సోమవా రం పార్టీ కార్యాలయంలో మీడియా తో మాట్లాడారు.    కాంగ్రెస్‌కు ఆగస్టు సంక్షోభం ఉందని..  ఎవరిని గద్దె దించి ఎవరిని పీఠం ఎక్కిస్తారో? ఎవరి గద్దె ఎవరు కూల్చుతారో చూడాలన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన రద్దుకు సంబంధించి ఏం జరిగిందో ఆయనకు అన్నీ తెలుసన్నా రు. పాస్ పోర్టుకు కూడా క్లియరెన్స్ ఉండాలన్నారు. బీజేపీ జాతీయ నూత న కమిటీ అంశంపై ఆమె మాట్లాడు తూ.. ఎవరినైనా ఒక బాధ్యత నుంచి తప్పించారంటే దానికంటే మంచి బాధ్యత ఇస్తారేమో? అని పేర్కొన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ జనర ల్ సెక్రెటరీగా లేరు..

మంత్రి అయ్యాక పార్టీ బాధ్యత ఉండదన్నారు. తాను ఎంపీ అయ్యాక సమయం సరిపోక కర్ణాటక ఇంచార్జి పదవిని వదిలేశానన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలమంతా కలిసే ఉన్నామని ఆమె స్పష్టం చేశారు. ఈసారి మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ టికెట్‌ను స్థానికులు అడుగుతున్నారని, పార్టీ కోసం కమిట్‌మెంట్‌తో పనిచేసే నాయకులకే అవకాశాలు వస్తాయన్నారు.