25 August, 2026 | 1:38 AM

సత్తుపల్లి సింగరేణి కాలనీలో ఘనంగా పోచమ్మ బోనాలు

25-08-2026 12:32 AM

సత్తుపల్లి ఆగస్టు 24. ( విజయ క్రాంతి ):  సత్తుపల్లి సింగరేణి కాలనీలో నెలకొన్న పోచమ్మ తల్లి ఆలయం అమ్మవారికి బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సాంప్రదాయ బద్ధంగా బోనాలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మంగళ వాయిద్యాలతో మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి, పోతురాజు కు నైవేద్యాలు సమర్పించారు. శివసత్తుల పూనకాలు పోతురాజుల విన్యాసాలు ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. కాలనీ అంతా పండుగ వాతావరణం నెలకొనగా పోచమ్మ తల్లి అమ్మవారికి బోనాల సమర్పించి అమ్మవారి ఆశీస్సులతో కాలనీ కుటుంబ సభ్యులకు అష్ట ఐశ్వర్యాలు , ఆయురారోగ్యాలతో , సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని వేడుకున్నారు. కాలనీలో పోచమ్మ తల్లి బోనాల పండుగను విజయవంతం చేసిన కాలనీ కుటుంబ సభ్యులు , బంధుమిత్రులకు పోచమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.