రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు ప్రవీణ్ ఔదార్యం
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాళోజీ శాఖ గ్రంథాలయంలో కాంపిటేటివ్ పుస్తకాలను అందింజేసీ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణిగుంట్ల ప్రవీణ్ తన ఔదార్యాన్నిచాటుకున్నారు. ఇటీవల ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్బంగా గ్రంథాలయాన్ని సందర్శించిన సందర్భంలో కాంపిటేటివ్ ప్రిపేరవుతున్న విద్యార్థులు పుస్తకాలు అడిగారు. ఆమెరకు కాంపిటేటర్లు అప్డేట్ వర్షన్ కాంపిటేటివ్ పుస్తకాలను ఆయన అందజేశారు.
విద్యార్థులు కోరిక మేరకు తగిన పుస్తకాలను తెప్పించి గ్రంధాలయానికి డొనేట్ చేశారు. విద్యార్థులు పట్టదలతో అభ్యసించి లక్ష్యాన్ని చేరుకోవాలని ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణిగుంట్ల ప్రవీణ్ అన్నారు. అప్డేట్ వెర్షన్ కాంపిటెటివ్ బుక్స్ అందజేయడం పట్ల గ్రంథాలయంలో ఉచితంగా స్టడీ చేస్తున్న విద్యార్థులు ప్రవీణ్ కు కృతజ్ఞతలు తెలిపారు.






