21-02-2026 12:24:20 AM
ఘట్ కేసర్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధి దివ్యనగర్ లోని నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి టె క్ ఫెస్ట్-2026 శుక్రవారం ప్రారంభించారు. నాడు ఈనెల 20, 21 శుక్ర, శనివారాలలో ఇంజనీరింగ్ ఎంబీఏ విద్యార్థులను భాగస్వాములను చేస్తూ ఈరాష్ట్ర స్థాయి టెక్ ఫెస్ట్ ను రూపొందించారు. విద్యార్థుల సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేలా పలు పోటీలను నిర్వహిస్తున్నారు.
సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అధ్యయనం చేస్తూ, నిరంతర పరిశోధనలను ప్రోత్సాహంచడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రారంభోత్సన ముఖ్య అతిథిగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కు చెందిన ట్రైనింగ్ డివిజన్ హెడ్ జెవిఆర్‌ఎస్ ప్రసాద్ విచ్చేసి టెక్ పేస్ట్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ టెక్నికల్ స్కిల్స్ ను పెంపొందించుకుని ముందుకు సాగాలన్నారు.
శాస్త్రీయంగా ఆలోచించడం, దానికి ఆనుగుణంగా లాజికల్ థింకింగ్ అలవర్చుకోవాలని తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుండి 92 కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. శుక్రవారం నాటి ప్రాంభోత్సవ వేడుకలకు నల్ల మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ కేతిరెడ్డి సంధ్యావలి, కళాశాల డైరెక్టర్ డాక్టర్ దివ్య నల్ల, ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ స్నేహ నల్ల, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హెచ్.ఎన్.వి. రమేష్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యా పకులు, పలు కళాశాల నుండి విచ్చేసిన విద్యార్ధులు పాల్గొన్నారు.