27 March, 2026 | 3:00 AM

స్త్రీవాద్ కా ఉద్భవ్ ఔర్ ఆవశ్యకతపై రాష్ట్ర స్థాయి సదస్సు

27-03-2026 01:03 AM

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  పోస్టర్ల ఆవిష్కరణ

కామారెడ్డి, మార్చి26 (విజయక్రాంతి): కామారెడ్డి ప్రభుత్వ ఆరట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలోని హిందీ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 28 న ‘స్త్రీవాద్ కా ఉద్భవ్ ఔర్ ఆవశ్యకత‘ (స్త్రీవాదం: ఆవిర్భావం, ఆవశ్యకత) అనే అంశంపై రాష్ట్ర స్థాయి నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ తెలిపారు. గురువారం ఈ సదస్సుకు సంబంధించిన పోస్టర్ లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ మాట్లాడుతూ..ప్రస్తుత సమాజంలో స్త్రీవాదం, మహిళా చైతన్యంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జాతీయ భాష హిందీ సాహిత్యంలో స్త్రీవాద ధోరణులను, సామాజిక మార్పులను చర్చించే ఇలాంటి సదస్సులు విద్యార్థుల మేధో వికాసానికి ఎంతగానో తోడ్పడతాయి అని అన్నారు.

సదస్సు కన్వీనర్ హిందీ విభాగం అధిపతి డాక్టర్ జి. శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా  రిసోర్స్ పర్సన్గా నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి. హేమలత హాజరై ప్రసంగించనున్నారు. హిందీ సాహిత్యంలో, ప్రత్యేకంగా స్త్రీవాద సాహిత్యంపై ఆమెకు ఉన్న అపారమైన అనుభవం, విశ్లేషణ విద్యార్థులకు, పరిశోధకులకు ఎంతో మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. కిష్టయ్య, ఆయా విభాగాల అధిపతులు అంకం జయప్రకాష్, డాక్టర్ దినకర్,ఎన్ రాములు, శ్రీవల్లి, హిందీ అధ్యాపకులు డాక్టర్ బాలాజీ  తదితరులు పాల్గొన్నారు.